12.5 కేజీల డంబుల్‌తో వర్క్‌ అవుట్స్‌ చేస్తున్న రవితేజ!

by సూర్య | Sun, Jan 12, 2020, 07:44 PM

రాజా ది గ్రేట్‌తో హిట్‌ కొట్టిన మాస్‌ మహరాజ్‌ రవితేజ తరువాత మళ్లీ గాడి తప్పాడు. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రవితేజ. ఇప్పటికే వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు రవితేజ. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే తన నెక్ట్స్ సినిమాను కూడా ప్రారంభించాడు రవితేజ. గతంలో తనతో డాన్‌ శ్రీను, బలుపు సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాకు క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం రవితేజ ఫిట్‌గా రెడీ అయ్యే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. అందుకోసం ఫిట్‌గా కనిపించేందుకు కండలు పెంచుతున్నాడు రవితేజ. తాజాగా రవితేజ వర్క్‌ అవుట్స్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 12.5 కేజీల డంబుల్‌తో వర్క్‌ అవుట్స్‌ చేస్తున్న రవితేజ ఫిట్‌నెస్‌ చూస్తే కుర్ర హీరోలకు కూడా షాక్‌ ఇచ్చేలా ఉన్నాడు.

Latest News
 
'దేవర' సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్ల‌రి నరేష్ Tue, Apr 30, 2024, 10:15 AM
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM