యాప్ లతో కాస్త జాగ్రత్త...లేకపోతే మీ సమాచారమంతా తస్కరణ

by సూర్య | Mon, Aug 15, 2022, 10:52 PM

వివిధ కార్యక్రమాల కోసం మనకు అనేక యాప్ లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో మన సమాచారానికి కూడా గోప్యత లేకుండా పోతోంది. యాప్ ల సాయంతో మాల్వేర్లను ఫోన్లలోకి ప్రవేశపెట్టేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఒక్కసారి మాల్వేర్ చొరబడిందంటే ఆ ఫోన్ లోని సమాచారం అంతా తస్కరణకు గురవుతుంది. తాజాగా డ్రాకేరిస్ అనే మాల్వేర్ కూడా ఆండ్రాయిడ్ యూజర్ల పాలిట విలన్ లా పరిణమించిందంటూ ఫేస్ బుక్ హెచ్చరికలు చేసింది. ఈ మాల్వేర్ ఫోన్ లో ప్రవేశిస్తే వాట్సాప్, యూట్యూబ్ లను కనిపించకుండా మాయం చేస్తుందని వెల్లడించింది. నకిలీ, థర్డ్ పార్టీ యాప్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 


ముఖ్యంగా, గేమింగ్ యాప్ ల సాయంతో డ్రాకేరిస్ మాల్వేర్ ను స్మార్ట్ ఫోన్లలోకి చొప్పిస్తున్నారని ఫేస్ బుక్ పేర్కొంది. ఈ మాల్వేర్ ఫోన్ లోని యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను కూడా ఏమార్చగలదని వివరించింది. బిట్టర్ ఏపీటీ అనే హ్యాకింగ్ గ్రూప్ ఈ మాల్వేర్ సృష్టికర్త అని వెల్లడించింది. యూజర్ అనుమతి లేకుండానే ఫోన్ లో ఏమైనా చేసేందుకు ఈ డ్రాకేరిస్ మాల్వేర్ దోహదపడుతుందని వివరించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రొటెక్షన్ ఉన్న యాప్ లను మాత్రమే ఇన్ స్టాల్ చేసుకోవాలని, థర్డ్ పార్టీ ఏపీకే సైట్ల నుంచి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోరాదని ఫేస్ బుక్ స్పష్టం చేసింది.

Latest News

 
పుచ్చలపల్లి 39వ వర్ధంతి సందర్భంగా నివాళులు Sun, May 19, 2024, 10:13 PM
నోరు జారిన నేత Sun, May 19, 2024, 10:11 PM
రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై స్పందించిన విజయ్ కుమార్ Sun, May 19, 2024, 10:10 PM
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి Sun, May 19, 2024, 10:09 PM
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతాం Sun, May 19, 2024, 10:09 PM