థాయ్‌లాండ్ లో ఘోర అగ్ని ప్రమాదం...13 మంది సజీవ దహనం

by సూర్య | Sat, Aug 06, 2022, 03:45 AM

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఇటీవల అగ్ని ప్రమాద ఘటనలు  పెరిగిపోతున్నాయి. తాజాగా థాయ్లాండ్లో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది సజీవదహనం అయ్యారు. 40 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. తూర్పు థాయ్ చోన్బురి ప్రావిన్సుల్లోని సత్తాహిప్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజధాని బ్యాంకాక్ సమీపంలోని మౌంటెన్ బి అనే నైట్ క్లబ్లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక పోలీస్ అధికారి ఉట్టిపోంగ్ సోమ్జై తెలిపారు. ఇప్పటి వరకూ గుర్తించిన ప్రమాద మృతుల్లో విదేశీయులు ఎవరూ లేరని పేర్కొన్నారు. మృతులంతా థాయ్‌లాండ్ పౌరులేనని చెప్పారు. గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.


ఘనటపై థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చన్-ఓచా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు సూచించారు. వైద్యానికి పూర్తి బాధ్యత వహిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా వినోద, విహార కేంద్రాల్లో ప్రమాదాలను నివారించే భద్రతా చర్యలు చేపట్టాలని, అగ్ని ప్రమాద నివారణకు ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

Latest News

 
మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాము Fri, May 17, 2024, 11:49 AM
బాబు ప్రోద్భలంతోనే దాడులు Fri, May 17, 2024, 11:45 AM
టీడీపీ దాడుల‌పై గవర్నర్ కి వైసీపీ నేతల పిర్యాదు Fri, May 17, 2024, 11:45 AM
దీపక్‌ మిశ్రా అధికారులను బెదిరిస్తున్నారు Fri, May 17, 2024, 11:44 AM
కూట‌మి నేత‌లు చెప్పిన‌చోటే పోలీసు అధికారుల‌ను మార్చారు Fri, May 17, 2024, 11:42 AM