బెంగళూరుకు మహర్థశ...ఐకియా స్టోర్ ఏర్పాటు

by సూర్య | Thu, Jun 23, 2022, 02:53 AM

దేశంలోని అతిపెద్ద ఐకియా స్టోర్ ను ఆ కంపెనీ బెంగళూరులో ఏర్పాటు చేసింది. బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలలో స్టోర్లను ఏర్పాటు చేసేందుకు తాము రూ.10,500 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు అంతకుముందే ఐకియా తెలిపింది. భారత్‌లో తొలి దశలో భాగంగా కంపెనీ బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ నగరాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు చెప్పింది. ఐకియాకు భారత్ ప్రధాన మార్కెట్‌గా ఉందని కంపెనీ చెప్పింది. దీని ప్రకారమే దేశంలోనే అతిపెద్ద స్టోర్‌ను ఐకియా బెంగళూరులో ఏర్పాటు చేసింది. తొలి బిగ్ బాక్స్ స్టోర్ ఫార్మాట్‌ను బెంగళూరులోని నాగసంద్రలో ఏర్పాటు చేసినట్టు ఐకియా ప్రకటించింది. ఈ స్టోర్ 4,60,000 చదరపు అడుగులలో విస్తరించి ఉంది. దేశంలో తన ఫుట్‌ప్రింట్‌ను పెంచుకునేందుకు త్వరలోనే మరిన్ని లార్జ్ ఫార్మాట్ స్టోర్లను, మాల్స్‌లో చిన్న అవుట్‌లెట్లను తెరవనున్నట్టు ఐకియా ప్రకటించింది. బెంగళూరులో రాబోయే ఏళ్లలో రూ.3 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఐకియా ఇండియా సీఈవో సుసానే పుల్వెరర్ తెలిపారు. నాగసంద్ర స్టోర్ దేశంలో నాలుగో ఐకియా స్టోర్. ఇంటి అవసరాలకు కావాల్సిన పలు రకాల ఫర్నిషింగ్‌ను ఈ స్టోర్‌లో ఆఫర్ చేస్తోంది. 12.2 ఎకరాలలో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. 7 వేలకు పైగా హోమ్ ఫర్నింగ్ ప్రొడక్టులు ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ స్టోర్‌లోనే వెయ్యి కుర్చీల రెస్టారెంట్‌ను ఆఫర్ చేస్తుంది.


భారత్‌లో ఐకియా క్రమక్రమంగా వృద్ధి సాధిస్తోంది. తన మార్కెట్‌ను మరింత బలంగా మార్చుకోవాలని ఐకియా ప్లాన్ చేస్తోంది. అయితే పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేందుకు సమయం పడుతుందని ఐకియా సీఈవో తెలిపారు. లీజ్ మోడల్ లేదా భూమి కొనుగోలు ద్వారా బెంగళూరులో మరిన్ని ప్రాజెక్టులను తాము తీసుకురానున్నట్టు తెలిపారు.


కేవలం ఒకే భౌగోళిక ప్రాంతంపై ఆధారపడాల్సినవసరం లేకుండా.. తన సప్లయి చెయిన్‌ను విస్తరించుకోవాలని చూస్తున్నట్టు ఐకియా కంపెనీ తెలిపింది. బెంగళూరు స్టోర్ నిర్వహణ కోసం ఐకియా వెయ్యి మంది ఉద్యోగులను నియమించుకుంది. ప్రస్తుతం ఐకియా స్టోర్లలో 3 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భవిష్యత్‌లో ఉద్యోగుల సంఖ్యను 10 వేల పెంచాలని చూస్తున్నట్టు ఐకియా తెలిపింది. అంటే కొత్తగా కంపెనీ 7 వేల మంది నియమించుకుంటోంది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM