ఏడాది చివరికల్లా దేశ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4 జీ సేవలు

by సూర్య | Thu, Jun 23, 2022, 02:49 AM

దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఏడాది చివరి కల్లా 4జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని బిఎస్ఎన్ఎల్ భావిస్తోంది. అదే జరిగితే ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరలకే మంచి ప్రయోజనాలతో ప్లాన్‌లను అందిస్తోంది. 4జీ సర్వీస్‌లు అందుబాటులోకి వస్తే యూజర్లు ఈ సంస్థ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి.


మరోవైపు బీఎస్‌ఎన్ఎల్ కొత్తగా ఏర్పాటు చేసే 4జీ టవర్లకు మరో ప్రత్యేకత ఉంటుందని సమాచారం. సింపుల్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేట్‌తో ఇవి 5జీకి కూడా సపోర్ట్ చేస్తాయట. అంటే భవిష్యత్తులో 5జీ నెట్‌వర్క్ కోసం ఈ టవర్లను బిఎస్ఎన్ఎల్ ఉపయోగించే అవకాశం ఉంది. అయితే బీఎస్ఎన్ఎల్ 5జీ ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు.


ప్రభుత్వ టెలికం సంస్థ భారత్‌ సంచార్ నిగమ్ లిమిటెడ్ 4జీ నెట్‌వర్క్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దేశంలో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీస్‌లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టులో ముందుగా కొన్ని ప్రాంతాల్లో 4జీ మొదలుకానుంది. ఆ తర్వాత ఈ ఏడాది చివరికల్లా దేశంలోని చాలా ప్రాంతాల్లో 4జీ నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకురావాలని బిఎస్ఎన్ఎల్ ప్లాన్‌ చేసుకుంది. అయితే బీఎస్ఎన్ఎల్ ముందుగా ఏ జిల్లాలో 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించనుందన్న విషయం తాజాగా బయటికి వచ్చింది.


బిఎస్ఎన్ఎల్ ముందుగా తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో 4జీ సర్వీస్‌లను ప్రారంభించనుందని ఓ రిపోర్ట్‌ వెలువడింది. ఇందుకోసం నాగర్‌కోయిల్ బిజినెస్ ఏరియాలో ఉన్న 292 టవర్లను అప్‌గ్రేడ్ చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఆ పనులు చేపడుతోందని తెలుస్తోంది. దీంతో ఆ టవర్ల ద్వారా 4జీ సర్వీస్‌లను అందించనుంది. అయితే ఈ మొబైల్‌ టవర్లు 5జీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండనున్నాయి.


వీటితో పాటు నాగర్‌కోయిల్‌ ప్రాంతంలో మరో 300 టవర్లను కూడా బీఎస్ఎన్ఎల్ నెలకొల్పనుందని ఆ కథనం ద్వారా బయటికి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో 4జీ సర్వీస్‌లు సమర్థవంతంగా ఉండనున్నాయి. వీటితో పాటు మైక్రో టవర్ల ఏర్పాటు కోసం బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌ చేస్తోంది. మొబైల్‌ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండే వ్యాపార సముదాయాలు, బస్ స్టాండ్‌లు, ఆసుపత్రులు లాంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


 

Latest News

 
పుచ్చలపల్లి 39వ వర్ధంతి సందర్భంగా నివాళులు Sun, May 19, 2024, 10:13 PM
నోరు జారిన నేత Sun, May 19, 2024, 10:11 PM
రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై స్పందించిన విజయ్ కుమార్ Sun, May 19, 2024, 10:10 PM
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి Sun, May 19, 2024, 10:09 PM
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతాం Sun, May 19, 2024, 10:09 PM