రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటిన సల్మాన్ ఖాన్

by సూర్య | Wed, Jun 22, 2022, 11:57 PM

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రముఖ బాలివుడ్ హీరో్ సల్మాన్ ఖాన్ మొక్కనాటారు. ఇలా కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ బుధ‌వారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాలుపంచుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ మొక్క‌ను ఆయ‌న నాటారు.  త‌న అభిమానుల‌కు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకునే దిశ‌గా సల్మాన్ ఖాన్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినప‌ల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మంలో దాదాపుగా అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి వ‌చ్చిన స‌ల్మాన్‌... ఓ మొక్క‌ను నాటి ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామి అయ్యారు. ఈ సంద‌ర్భంగా స‌ల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేర‌కు తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాలుపంచుకున్నాన‌ని స‌ల్మాన్ పేర్కొన్నారు. గ్లోబ‌ల్ వార్మింగ్‌ను క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో త‌న అభిమానులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM