ఆప్ఘనిస్థాన్ లో తీవ్ర విషాదం..భూకంపంతో 280 మంది మరణం

by సూర్య | Wed, Jun 22, 2022, 04:52 PM

అటు తాలిబాన్ల పాలనలో తీవ్ర నిర్భంధాన్నిఎదుర్కొంటున్న ఆప్ఘనిస్థాన్ ప్రజలు తాజాగా భూకంపం భయంతో ఆందోళన చెందుతున్నారు. ఆప్ఘనిస్థాన్ ను తీవ్ర భూకంపం కుదిపేసింది. దీని కారణంగా 280 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం ఈ విపత్తు సంభవించింది. 600 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని భావిస్తున్నారు.  భూకంప సమయంలో ప్రకంపనలు పాకిస్థాన్, భారత్ లోని కొన్ని ప్రాంతాలకు సైతం వ్యాపించినట్టు సమాచారం. ఆప్ఘనిస్థాన్ పాలనా పగ్గాలను తాలిబాన్లు హస్తగతం చేసుకున్న తర్వాత ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ సమయంలో ఈ విపత్తు రావడం మరింత నష్టమేనని చెప్పుకోవాలి.


పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఖోస్ట్ పట్టణానికి 44 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. రాజధాని కాబూల్ లోనూ బలమైన కుదుపులు వచ్చినట్టు స్థానికులు చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది తూర్పు ఆఫ్ఘన్ లోని పక్తికా ప్రావిన్స్ కు చెందిన వారే ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం రంగంలోకి దించారు. 

Latest News

 
గజ వాహనంపై ముక్తిరామలింగేశ్వరుడు Tue, Apr 30, 2024, 10:50 AM
వైసిపి మద్దతుదారునపై కత్తులతో దాడి Tue, Apr 30, 2024, 10:28 AM
ఎన్డిఏ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయండి Tue, Apr 30, 2024, 10:18 AM
అరటిపండ్ల మాలతో టీడీపీ అభ్యర్థికి వినూత్న స్వాగతం Tue, Apr 30, 2024, 10:14 AM
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM