ఆ రాష్ట్రాలను ఇరకాటంలోకి నెట్టే వ్యూహం

by సూర్య | Sun, May 22, 2022, 02:52 PM

ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులేస్తోంది. ఇన్నాళ్లు పెట్రోల్  ధరలపై తనను టార్గెట్ చేసిన వివిధ రాష్ట్రాలోని వివిధ పార్టీల ప్రభుత్వాలను  మోడీ సర్కార్ టార్గెట్ చేసేందుకు సిద్దమవుతోంది. తాజాగా కేంద్రం పెట్రోల్, డీజీల్ పై  సుంకాన్ని తగ్గించింది. గత ఏడాది నవంబర్‌లోనూ కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5 మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం.. డీజిల్‌పై రూ.10 మేర సుంకాన్ని తగ్గించింది. రాష్ట్రాలను సైతం సుంకాలు తగ్గించాలని కోరింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సుంకాలను తగ్గించగా.. ఏపీ, తెలంగాణ మాత్రం పన్నులను తగ్గించలేదు. ఈసారి కూడా కేంద్రం పన్నులు తగ్గించాలని రాష్ట్రాలను కోరే అవకాశం ఉంది. ఇ లా తనను టార్గెట్ చేస్తున్న ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను తిరిగి టార్గెట్ చేయాలని బీజేపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు కదులుతున్నట్లు  సమాచారం. ఇదిలావుంటే ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర దాదాపు రూ.120గా ఉండగా.. డీజిల్ ధర 105.47గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 121.26గా ఉండగా.. డీజిల్ ధర రూ. 106.87గా ఉంది. కేంద్రం తాజా తగ్గింపుతో లీటర్ డీజిల్ ధర వంద రూపాయల దిగువకు రానుంది.

Latest News

 
జూన్‌ 9న కాకినాడ జిల్లా అరసం మహాసభ Thu, May 16, 2024, 09:03 PM
ఒంగోలులో పోలింగ్ ఎంతంటే? Thu, May 16, 2024, 09:01 PM
మాకు జీతాలు చెల్లించండి Thu, May 16, 2024, 09:00 PM
వైభవంగా కొనసాగుతున్న ‘గంగమ్మ జాతర' Thu, May 16, 2024, 08:59 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Thu, May 16, 2024, 08:58 PM