టీలో చక్కరా లేద బెల్లం ఎదీ మేలు...ఆయుర్వేదం ఏం చెబుతోంది

by సూర్య | Sun, May 22, 2022, 12:35 PM

కొన్ని పదార్థాల  కలయిక అనర్థాలకు దారితీస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యంపై ప్రభావం చూపించే అసహజ కలయికల్లో.. అరటి పండు, పాలు.. పాలు, చేపలు.. పెరుగు, వెన్న, తేనె, నెయ్యి.. ఇలా పొందికలేని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వాపు, చర్మ సమస్యలు, ఆటో ఇమ్యూన్ సమస్యలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చక్కెర ఆరోగ్యానికి హాని చేస్తుందన్న అవగాహన పెరుగుతోంది. దీంతో కొందరు చక్కెర మానేసి బెల్లానికి (జాగరీ) ప్రాధాన్యం ఇస్తున్నారు. టీ లో బెల్లం, తేనె కలుపుకుని తాగుతున్నారు. కానీ, ఆయుర్వేదం మాత్రం టీ, బెల్లం కలయిక సరైనది కాదని అంటోంది. 


‘‘ఆయుర్వేదం ప్రకారం.. విరుద్ధ ఆహారం లేదా అసహజమైన పదార్థాల కలయికతో ఆమ గుణానికి దారితీస్తుంది. అంటే జీర్ణంపై ప్రభావం చూపించే హానికారకాలు విడుదల అవుతాయి. ప్రతీ ఆహారానికి ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. ఇవి రుచి, శక్తి, జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి’’ అని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ రేఖ రాధామణి తెలిపారు.  బెల్లం అన్నది వేడిని కలిగిస్తుంది. పాలు చల్లదనాన్ని ఇస్తాయి. ఈ రెండింటిని కలపడం అననుకూలమైనదిగా ఆమె పేర్కొన్నారు. మరి టీలో సహజ తీపిని తీసుకురావడం ఎలా..? మిశ్రి లేదా రాక్ షుగర్ మంచిదని.. పాలు మాదిరే చల్లటి గుణంతో ఇది ఉండడం అనుకూలమని రాధామణి వెల్లడించారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM