ఒమిక్రాన్ వేరియంట్ ఉప రకం బీఏ 4 నో టెన్షన్

by సూర్య | Sun, May 22, 2022, 12:32 PM

ఒమిక్రాన్ వేరియంట్ ఉప రకం బీఏ 4 తో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని వైద్యులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఏదైనా కానీ, గతానికి భిన్నంగా కొత్త లక్షణాలు ఏవీ కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత కూడా లేదని స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తిలో బీఏ 4 రకాన్ని గుర్తించినట్టు తెలంగాణ సర్కారు ప్రకటించడం తెలిసిందే. సంబంధిత వ్యక్తిలో లక్షణాలు ఏవీ లేవని వైద్యులు వెల్లడించారు.


కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ లో ఉప రకమైన బీఏ 4 తమిళనాడులోకి అడుగుపెట్టింది. దేశంలో మొదటి కేసు హైదరాబాద్ లో వెలుగు చూసిన రెండు రోజులకే తమిళనాడులో రెండో కేసు బయటపడింది. తమిళనాడులో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 4 కేసు ధ్రువీకరణ అయినట్లు వైద్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ఒక ప్రకటన విడుదల చేశారు.చెంగల్ పట్టు జిల్లా నవులూరుకు చెందిన వ్యక్తిలో ఈ వైరస్ గుర్తించారు. బీఏ 4 రకాన్ని ఈ ఏడాది జనవరి 10న దక్షిణాఫ్రికాలో మొదటిసారి కనుగొన్నారు. ఆ తర్వాత ఆఫ్రికా దేశాలన్నింటిలోనూ ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇండియా సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్షియం ఈ నెల 23న బులెటిన్ విడుదల చేయనుంది. 

Latest News

 
తాకాసివీధిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల Tue, May 07, 2024, 02:46 PM
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు Tue, May 07, 2024, 02:45 PM
చెంగారెడ్డి అన్న కుమారుడు వైసీపీలో చేరిక Tue, May 07, 2024, 01:46 PM
వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి వైసిపి గెలుపుకు కృషి చేయాలి Tue, May 07, 2024, 12:50 PM
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ Tue, May 07, 2024, 12:40 PM