జగన్ ఇప్పటికైనా మారవా....?

by సూర్య | Sun, May 22, 2022, 11:19 AM

పెట్రోలుపై 31శాతం వ్యాట్ + రూ.4+రూ.1,డీజిల్ పై 22.5 శాతం వ్యాట్ +రూ.4, +రూ.1 పన్నులు వేసి 151 సీట్లిచ్చిన ప్రజలను బాదేస్తావా. ఓ వైపు కేంద్రం మరోవైపు పొరుగు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించి ఉపశమనం కలిగిస్తుంటే మీరు మాత్రం స్పందించరా.... ? అని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు.  వ్యాట్ లో కనీసం 5 శాతంతో పాటు అదనంగా మీరు వేస్తున్న రూ.5 పన్ను తగ్గించినా లీటర్ కు రూ.10 భారం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ మరోవైపు లక్షా 10 వేల కోట్లు ఎరువులపై రాయితీ ప్రకటించింది అని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా ఏపీ ప్రజలపై మాత్రం మీరు కనికరం చూపరా. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిందిపోయి కుమ్ముడే కుమ్ముడు అంటూ మరింత కుమ్మేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM