భారత్ లో పునరుజ్జీవం కోసం కాంగ్రెస్ శ్రమిస్తోంది: రాహుల్ గాం:ధీ

by సూర్య | Sat, May 21, 2022, 09:19 PM

భారత్ లో పునరుజ్జీవం కోసం కాంగ్రెస్ శ్రమిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అదే సందర్భంలో సొంత పార్టీలోని లోపాలపై నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొంత పార్టీ కాంగ్రెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర విపక్షాల కంటే కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పది అని తాను అనుకోవడంలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓ పెద్దన్నగా భావించడంలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అనేక విధాలుగా పోరాడుతోందని తెలిపారు. అంతర్గత కలహాలు, తిరుగుబాట్లు, లోపాలు, ఎన్నికల ఓటములు వంటి సమస్యలతో పోరాడుతున్నామని వివరించారు.


"భారత్ లో పునరుజ్జీవం కోసం కాంగ్రెస్ శ్రమిస్తోంది. ఇదొక జాతీయస్థాయి సిద్ధాంతపరమైన యుద్ధం. గళం విప్పని ఆత్మ ఉన్నా లేనట్టే. ఆ దిశగా చూస్తే భారత్ గొంతుకను అణచివేశారు. పాకిస్థాన్ లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో భారత్ లోనూ చాలావరకు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. మేం ఇప్పుడు పోరాడుతోంది ఒక్క బీజేపీతోనే కాదు... ఓ సంస్థ కబళించిన దేశ సంస్థాగత నిర్మాణం కోసం కూడా పోరాడుతున్నాం. నిధుల విషయంలో ఆ సంస్థతో మేం ఏ విధంగానూ పోటీపడలేం. అందుకే ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపట్టాలని భావిస్తున్నాం" అని వివరించారు

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM