మెహుల్ చోక్సీకి ఊరాట...ఆ కేసును ఉపసంహరించుకొన్న డొమినికా

by సూర్య | Sat, May 21, 2022, 07:34 PM

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ‌కి ఊరాట  లభించింది. అతనిపై నమోదుచేసిన కేసును ఉపసంహరించుకున్నట్టు డొమినికా అధికారులు ప్రకటించారు. వజ్రాల వ్యాపారి అయిన మెహుల్ ఛోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుల్లో ఒకరు. తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి రూ.13,500 కోట్ల మేర భారీ మొత్తంలో కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ కంపెనీ.. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద రుణం తీసుకుని ఎగవేశారన్న ఆరోపణలపై సీబీఐ ఇటీవల కేసు నమోదుచేసింది. పీఎన్‌బీ కుంభకోణం బయటపడటానికి ముందు 2017లో అంటిగ్వా పౌరసత్వం తీసుకున్న మెహుల్ చోక్సీ.. ఈ తర్వాత 2018 జనవరిలో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం అతడి మేనల్లుడు నీరవ్ మోదీ లండన్ జైల్లో ఉన్నాడు.


ఇదిలావుంటే తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్టు చోక్సీపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తన అభీష్టానికి విరుద్ధంగా అంటిగ్వా అండ్ బార్బుడా నుంచి డొమినికాకు కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చారని ఛోక్సీ తరఫు లాయర్ల వాదనలతో డొమినికా న్యాయస్థానం ఏకీభవించింది. అక్రమంగా ప్రవేశించినట్టు నమోదైన కేసును కొట్టివేస్తున్నట్టు తెలిపింది.


గతేడాది మే నెలలో మెహుల్ చోక్సీని అరెస్ట్ చేసిన డొమినికా పోలీసులు.. అక్రమంగా తమ దేశంలోకి చొరబడ్డాడని అభియోగాలు మోపారు. అయితే భారత ఇంటెలిజెన్స్ విభాగం రా అధికారులు మే 23న తనను అంటిగ్వాలోని జాలీ హార్బర్‌లో కిడ్నాప్ చేశారని.. నౌకలో అక్కడ నుంచి డొమినికాకు ఎత్తుకొచ్చారని ఛోక్సీ కోర్టుకు తెలిపారు. అతడ్ని తిరిగి అంటిగ్వాకు వెళ్లేందుకు డొమినికా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018 నుంచి అంటిగ్వాలో ఉంటున్న చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా లభించింది.

Latest News

 
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 12:40 PM
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM