జూన్‌ 10న పోలింగ్‌ జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలోకె

by సూర్య | Fri, May 13, 2022, 02:45 PM

రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి.విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్‌ ప్రభుల పదవీకాలం జూన్‌ 21తో ముగుస్తుంది. ఆ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. శాసన సభలో పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే నాలుగు స్థానాలూ వైయ‌స్సార్‌సీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కన్పిస్తోంది.


రాజ్యసభలో రాష్ట్ర కోటా 11 స్థానాలు. ప్రస్తుతం ఐదుగురు వైయ‌స్సార్‌సీపీ సభ్యులున్నారు (జూన్‌ 21తో పదవీ కాలం ముగిసే విజయసాయిరెడ్డి స్థానాన్ని మినహాయిస్తే). జూన్‌ 10న పోలింగ్‌ జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరతాయి. అప్పుడు వైయ‌స్సార్‌సీపీ బలం ఐదు నుంచి తొమ్మిదికి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వైయ‌స్సార్‌సీపీ సభ్యుల్లో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం 2024 ఏప్రిల్‌ 22తో ముగుస్తుంది.


టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీకి చెందిన సీఎం రమేష్‌ల పదవీ కాలమూ అదే రోజుతో ముగుస్తుంది. ఈ మూడు స్థానాలకు 2024 ఎన్నికలకు ముందు ఎన్నికలు జరుగుతాయి. శాసనసభలో సంఖ్యాబలం ఆధారంగా ఆ మూడు స్థానాలను కూడా వైయ‌స్సార్‌సీపీ దక్కించుకోనుంది. అప్పుడు రాష్ట్ర కోటాలోని 11 రాజ్యసభ స్థానాలూ వైయ‌స్సార్‌సీపీ ఖాతాలో చేరతాయి.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM