కొత్త కేసులో బాధితులు...పాతవారే

by సూర్య | Wed, Jan 19, 2022, 04:24 PM

గతంలో కరోనా సోకిన వారు ఈ మూడో దశలో జరభధ్రంగా ఉండాలి. ఎందుకంటే కరోనా మూడో విడతలో భాగంగా హైదరాబాద్ లో వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో ప్రతి మూడింటిలో ఒకటి గతంలో ఇన్ఫెక్షన్ బారిన పడి, మళ్లీ ఇన్ఫెక్షన్ కు గురైనవే (రీ ఇన్ఫెక్షన్) ఉంటున్నాయి. మొదటి లేదా రెండో విడతలో కరోనా బారిన పడిన వారు మళ్లీ వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాకపోతే ఎక్కువ మందిలో లక్షణాలు లేకపోవడం, ఉన్నా కానీ, స్వల్పంగా కనిపిస్తుండటం ఆశాజనకం. కరోనా రెండో విడతలో ఇన్ఫెక్షన్ బారిన పడిన ఓ వ్యక్తి కోలుకునేందుకు నెల పట్టింది. కానీ, ఇప్పుడు పాజిటివ్ గా మరోసారి వచ్చినా లక్షణాలు ఏవీ లేవని తెలిపాడు. మరో గృహిణి సైతం ఐదు నెలల విరామంతో రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. దీనిపై కేర్ హాస్పిటల్స్ గ్రూపు సీఈవో రాజీవ్ సింఘాల్ స్పందిస్తూ.. ‘‘మా ఆసుపత్రులకు వచ్చే కేసుల్లో కరోనా రీఇన్ఫెక్షన్ కేసులు 20-25 శాతంగా ఉంటున్నాయి. ఎక్కువ కేసుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. వారికి ఔట్ పేషెంట్ గానే చికిత్స అందిస్తున్నాం’’ అని చెప్పారు. ఇప్పటికీ డెల్టా కేసులు వస్తూనే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘‘రీ ఇన్ఫెక్షన్ కేసులు గణనీయంగానే వస్తున్నాయి. చాలా  వరకు పురోగతి ఇన్ఫెక్షన్ కేసులు కనిపిస్తున్నాయి. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రెండు డోసుల టీకా తీసుకున్న వారు సైతం.. ఇప్పుడు ఇన్ఫెక్షన్ కు గురి అవుతున్నారు. 30 శాతం మేర ఇవే కేసులు ఉంటున్నాయి’’ అని ఎస్ఎల్జీ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ ప్రదీప్ పాణిగ్రాహి తెలిపారు.

Latest News

 
సీఎం సొంత జిల్లాలో.. వైసీపీ ఎమ్మెల్యేపై బావమరిది పోటీ Thu, May 02, 2024, 07:12 PM
వైసీపీ నవరత్నాలకు పోటీగా కే.ఏ. పాల్ దశరత్నాలు Thu, May 02, 2024, 07:08 PM
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM