అటుు నేతగా...ఇటు ఇల్లాలీగా రెండు పాత్రాలు

by సూర్య | Wed, Jan 19, 2022, 03:42 PM

అటు ప్రజా నేతగా ఇటు ఇలాలీగా రెండు పాత్రపోషించడం అంతా సులువైన విషయం కాదు. ఆ పాత్రను సంకల్పమున్న వారే పూర్తిచేయగలరు. పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, పిల్లల హోం వర్క్ కోసం తాను సాయం చేస్తానని ప్రియాంక గాంధీ వాద్రా చెప్పారు. ఫేస్ బుక్ లైవ్ లో భాగంగా పలువురు యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. కేవలం తన పిల్లల హోం వర్క్ కోసమే కాకుండా ‘ఆంటీ’ అనుకుంటూ వచ్చే వారి స్నేహితుల హోం వర్క్ లోనూ సాయపడతానన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా సెషన్ ను స్టార్ట్ చేయడానికి ముందు కూడా తన కూతురు అసైన్ మెంట్ కు హెల్ప్ చేశానన్నారు. కొన్నికొన్నిసార్లు ఎన్నికల ప్రచారం నుంచి ఆలస్యంగా వస్తే.. వేకువజామున 3 నుంచి 4 గంటల వరకూ పిల్లలతో హోం వర్క్ చేయించేదానినని తెలిపారు. తన చిన్నప్పుడు తన అన్న రాహుల్ గాంధీతో తీవ్రంగా పోట్లాడేదాన్నని గుర్తు చేసుకున్నారు. తమ ఇంట్లో నిర్ణయాలు తీసుకోవడం విషయంలో భయంకరమైన ప్రజాస్వామ్యవాదం ఉండేదన్నారు.

Latest News

 
18 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్ Thu, May 02, 2024, 10:43 AM
నలుగురు ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:28 AM
ఆదరించండి అభివృద్ధి చేస్తా: జయచంద్ర Thu, May 02, 2024, 10:25 AM
మదనపల్లెలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:22 AM
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM