కొత్త కేంద్ర బడ్జెట్ లో మధ్య తరగతికి ఊరాటనిచ్చే అంశాలున్నాయాట

by సూర్య | Wed, Jan 19, 2022, 03:38 PM

కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో  పేద, మధ్య  తరగతికి ఎలాంటి ప్రయోజనాలు అందలేదని విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.


ఏటా కేంద్ర బడ్జెట్ వస్తుందంటే మధ్యతరగతి ప్రజలు తమకు ఏదైనా ఊరట దక్కుతుందా? అన్న ఆశతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసమే 2022-23 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రకాల పన్ను ప్రయోజనాలను ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ అంచనాలు వినిపిస్తున్నది స్టాండర్డ్ డిడక్షన్ గురించే. స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఆదాయం నుంచి ఆ మేరకు మినహాయించి చూపించుకోవచ్చు. 2005-06లో ఎత్తివేసిన ఈ ప్రయోజనాన్ని తిరిగి 2018-19 బడ్జెట్లో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టింది. మొదట రూ.40,000గా ప్రకటించి, ఆ తర్వాత రూ.50,000కు పెంచింది. ఇప్పుడు దీన్ని మరి కొంత పెంచే అవకాశం ఉంది. గతంలో మాదిరే రూ.10,000 పెంచుతారా, లేక మరింత ప్రయోజనం కల్పిస్తారా అన్నది బడ్జెట్ తో తేలిపోనుంది. పిల్లల విద్యా ఖర్చు గణనీయంగా పెరిగిపోతోంది. సెక్షన్ 80సీ కింద స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇదే మంత ప్రయోజనం కాదు. ఎందుకంటే జీవిత బీమా ప్రీమియం, ఈపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. పాఠశాల ఉన్నత విద్య, ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం చేసే పొదుపు, పెట్టుబడులకు ప్రత్యేక సెక్షన్ కింద ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, దీనిపైనా బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా.

Latest News

 
పవన్‌ కళ్యాణ్‌ను ఓడించకపోతే.. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటా: ముద్రగడ Tue, Apr 30, 2024, 07:26 PM
టీడీపీ మేనిఫెస్టోలో మోదీ బొమ్మ ఎందుకు లేదో చెప్పిన జగన్ Tue, Apr 30, 2024, 07:23 PM
మద్యం అక్రమ రవాణా బాగా పెరిగింది Tue, Apr 30, 2024, 05:51 PM
నేడు రెండు చోట్ల బాలకృష్ణ సభలు Tue, Apr 30, 2024, 05:50 PM
మైనింగ్ జరుపుకునే వెసులుబాటు కల్పించాలి Tue, Apr 30, 2024, 05:49 PM