పలు చోట్ల అగ్రి ప్రమాదాలు...కోట్ల ఆస్తినష్టం..మరో చోట తప్పిన ప్రాణ నష్టం

by సూర్య | Mon, Jan 17, 2022, 09:20 PM

మహారాష్ట్రంలో పలు  చోట్ల  వివిధ కారణాలతో అగ్నిప్రమాదం జరిగింది. ఒక చోట కోట్ల ఆస్తి నష్టపోగా మరో చోట తీవ్రంగా కాలిక గాయాలతో వ్యక్తులు బయటపడ్డారు. మరోచోట పెద్ద ఎత్తున్న ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారు. వివరాలలోకి వెళ్లితే... మహారాష్ట్రలోని థానేలోని ఓ క్లాత్ ప్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడ అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తి అగ్నికి ఆహుతి అయింది. భివాండిలోని కాజీ కాంపౌండ్‌లో ఓ మూతబడిన ఫ్యాక్టరీలో తొలుత చిన్న మంట రాజుకుంది. తర్వాత పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు అందించిన సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అసలు మంటలు ఎలా వ్యాపించాయో తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మూతబడిన ఫ్యాక్టరీ కావడంతో ఎవరికి ఏ హాని జరగలేదు. కానీ కోట్లాది రూపాయల విలువైన ఆస్తి మాత్రం నాశనం అయినట్టు థానే మున్సిపల్ కార్పొరేషన్ ధ్రువీకరించింది. ఇదిలావుంటే గతవారం థానేలోని భివాండి ప్రాంతంలోనే ఓ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పరస్‌ నాథ్ కాంప్లెక్స్ గోదాములో మంటలు వ్యాపించాయి. ఐదు ఫైరింజన్లతో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటల్లో గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. దీంతోపాటు వారం క్రితం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ విమానానికి పుష్ బ్యాక్ ఇచ్చిన వాహనంలో మంటలు చెలరేగాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-647ని వెనుక నుంచి నెట్టడంతో విమానం టగ్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 85 మంది ప్రయాణికులు ఉన్నారు.

Latest News

 
ఊరవతల నగ్నంగా మహిళ మృతదేహం.. అసలేమైంది Sun, May 19, 2024, 07:44 PM
మెగా ఫ్యామిలీపై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు Sun, May 19, 2024, 07:42 PM
యువకులే టార్గెట్.. రూ.లక్షల్లో జీతాలంటూ వల.. ఆపై విదేశాలకు తీసుకెళ్లి దారుణాలు Sun, May 19, 2024, 07:32 PM
వేరుశనగ విత్తనాలకు దరఖాస్తులు చేసుకోండి Sun, May 19, 2024, 07:08 PM
సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఎం నేతలు Sun, May 19, 2024, 07:05 PM