రోహిత్ వేములను స్మరించుకొన్న రాహుల్...ప్రియాంకా

by సూర్య | Mon, Jan 17, 2022, 09:07 PM

దేశ వ్యాప్తంగా నేడు రోహిత్ వేముల సంస్మరణ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా రోహిత్ వేములను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా స్మరించుకొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. 2016లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కులవివక్ష అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. అప్పటినుంచి విద్యాసంస్థల్లో కుల వివక్ష గురించి చర్చించుకునే ప్రతిసారి రోహిత్ వేముల పేరు ప్రస్తావిస్తున్నారు. 2016 జనవరి 17న రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి ప్రియాంక గాంధీ కూడా రోహిత్ వేములను స్మరించుకున్నారు. రోహిత్ వేములను కులవివక్షే చంపేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అతడి దళిత అస్తిత్వాన్ని తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. సంవత్సరాలు గడిచిపోయాయని, ఇప్పటికీ రోహిత్ వేముల తిరుగుబాటుకు ప్రతీకలా, అతడి తల్లి ఆశాభావానికి నిదర్శనంగా కొనసాగుతున్నారని వివరించారు. "అన్యాయానికి గురై, చివరి వరకు పోరాడిన రోహిత్ వేముల నా హీరో, నా సోదరుడు" అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అటు, ప్రియాంక గాంధీ స్పందిస్తూ, సామాజిక న్యాయం కోసం రోహిత్ వేముల బలమైన గొంతుక వినిపించాడని కొనియాడారు. దేశంలోని దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, రోహిత్ వేముల ప్రారంభించిన సామాజిక న్యాయం కోసం పోరును తాము మరింత ముందుకు తీసుకెళతామని ప్రియాంక పేర్కొన్నారు.

Latest News

 
పోలీసులను చూడగానే కలవరం.. ఫాలో అయితే వామ్మో.. అడవిలోనే దుకాణం పెట్టేశాడు Thu, May 02, 2024, 08:38 PM
లాస్ట్ పేరానే దెబ్బేసిందా.. అందుకే ఇన్ని తలనొప్పులా Thu, May 02, 2024, 08:33 PM
ఎగ్గొట్టడం బాబుకి అలవాటే Thu, May 02, 2024, 08:26 PM
ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌పై విషప్రచారం ఎందుకు బాబు? Thu, May 02, 2024, 08:26 PM
వైసీపీ మేనిఫెస్టో బ్రహ్మాండం Thu, May 02, 2024, 08:25 PM