పంజాబ్ పై ఆప్ ఆశలు...సర్వేలతో దూకుడు

by సూర్య | Mon, Jan 17, 2022, 05:17 PM

సర్వేలు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆశలు రేకెత్తిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ అధికారం కైవసం చేసుకోవడానికి దూకుడు పెంచింది. ఇదిలావుంటే పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఎన్నికల బరిలో దిగింది. బీజేపీ పరిస్థితి చెప్పుకోదగ్గ స్థితిలో ఉండట్లేదంటూ ఇదివరకు వెలువడిన ఎన్నికల సర్వేలు స్పష్టం చేశాయి. అధికారంలో రావడానికి బీజేపీ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందంటూ సర్వేలు తేల్చి చెప్పాయి. కాంగ్రెస్‌ రెండోస్థానంలో ఉంటుందని పేర్కొన్నాయి. ఈ పరిణామాల మధ్య ఓటర్లు- ఆమ్ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ.. పంజాబ్‌లోనూ పాగా వేస అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తోన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్.. పంజాబ్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని జోస్యం చెబుతున్నారు. అవి ఎంత వరకు ఫలించాయనేది మార్చి 10వ తేదీన తేలుతుంది.

Latest News

 
వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి వైసిపి గెలుపుకు కృషి చేయాలి Tue, May 07, 2024, 12:50 PM
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ Tue, May 07, 2024, 12:40 PM
వింజమూరులో పర్యటించిన మేకపాటి కుమారులు Tue, May 07, 2024, 12:08 PM
యధావిధిగా డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష Tue, May 07, 2024, 12:07 PM
శ్రీనివాసపురంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం Tue, May 07, 2024, 11:55 AM