కాలుష్యం...మానషులపైనే కాదు గర్భంపైనా ప్రభావం చూపుతాయి

by సూర్య | Mon, Jan 17, 2022, 02:19 PM

కాలుష్యం భూమి మీదున్న మనషులపైనే కాదు గర్భంలోనున్న శిశువులపై కూడా ప్రభావం చూపుతుందటా. భారత్ లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం గర్భిణులు, గర్భంలోని శిశువులకు చేటు చేస్తోంది. గర్భిణులు చివరి మూడు నెలల కాలంలో పరిసరాల్లోని సూక్ష్మ ధూళి కణాల (పార్టిక్యులేట్ మేటర్/పీఎం 2.5) ప్రభావానికి ఎక్కువగా గురైతే.. గర్భంలోని శిశువులకు ప్రాణాంతకంగా మారుతున్నట్టు ఒక అధ్యయనం గుర్తించింది. అంతేకాదు చివరి మూడు నెలల్లో కాలుష్యానికి ఎక్కువగా గురైతే ప్రసవం తర్వాత.. తొలినాళ్లలో శిశువులకు ప్రాణ ప్రమాదం ఉంటున్నట్టు తేలింది. ఈ అధ్యయనానికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో నేతృత్వం వహించగా, ఐఐటీ ఢిల్లీ సైతం సహకారం అందించింది. క్యూబిక్ మీటర్ గాలిలో పెరిగే ప్రతి 10 మైక్రో గ్రాముల పీఎం2.5 కణాలతో శిశువుల్లో మరణాలు రేటు 1.6 శాతంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా మగ శిశువులతో పోలిస్తే ఆడ శిశువుల్లో కాలుష్యకారక మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు తెలిపారు. భారత్ లో శిశు మరణాల రేటును తగ్గించేందుకు తక్షణమే వాయు కాలుష్య నివారణ ప్రణాళికలను అమలు చేయాలని అధ్యయనకారులు సూచించారు. గర్బిణులు చివరి మూడు నెలల సమయంలో కాలుష్య ప్రభావానికి లోను కాకుండా చూసుకుంటే.. తల్లితోపాటు శిశువుకు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటున్నాయని అధ్యయనంలో పాల్గొన్న సాగ్నిక్ డే తెలిపారు.

Latest News

 
భార్యని హింస పెట్టిన కేసులో భర్తకి జైలు శిక్ష Sat, May 18, 2024, 03:53 PM
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి Sat, May 18, 2024, 03:50 PM
ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన అశోక్ గజపతిరాజు Sat, May 18, 2024, 03:49 PM
మెగా ఫ్యామిలిలో ఏమి జరుగుతుంది? Sat, May 18, 2024, 03:49 PM
చంద్ర‌బాబుకు ఓట‌మి భ‌యం పట్టుకుంది Sat, May 18, 2024, 03:45 PM