ఇండియాలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

by సూర్య | Mon, Jan 17, 2022, 10:44 AM

ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం నమోదైన కేసుల కంటే సోమవారం రోజున 5 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.దేశంలో తాజాగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 16,56,341 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసుల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టినా పాజిటివిటీ రేటు 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 8209 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 157 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. భారత్‌లోని 29 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


 


 

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM