వ్యాక్సినేషన్ లో ప్రపంచంలోనే టాప్ టెన్ స్థానంలో

by సూర్య | Sun, Jan 16, 2022, 10:34 PM

ప్రజలకు వ్యాక్సినేషన్ అందించడంలో ప్రపంచంలోనే భారత్ టాప్ టెన్ స్థానంలో నిలిచింది. ఇదిలావుంటే కరోనా తో పోరాడేందుకు స్వదేశీ టాకాలతో భారత్ యుద్దం ప్రారంభించి ఏడాది పూర్తయింది. కరోనా కరాణంగా లక్షలాది మంది ప్రాణాలు వదిలారు. ఈ రోజుకు భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. వ్యాక్సినేషన్ లో భాగస్వామలు అయిన ప్రతీ ఒక్కరికీ ప్రధాని మోదీ సెల్యూట్ చేసారు. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా దీనిని ఆయన అభివర్ణించారు. ఇందుకోసం కృషి చేసిన హెల్త్ వర్కర్లు, శాస్త్రవేత్తలు, ప్రజలందరికీ ఆయన ఓ ట్వీట్‌లో అభినందనలు తెలిపారు.''ఈ రోజుతో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో, ప్రతి ఒక్కరి కృషితో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా ఇది నిలిచింది'' అని మంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో 156.76 కోట్ల వ్యాక్సినేషన్ కవరేజ్ పూర్తి చేసుకుంది. 2021 జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. తొలుత హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన వారికి, అనంతరం 45 పైబడిన వాళ్లకు విస్తరించారు. ఆ తదుపరి 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. ఈ నెల 10వ తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ వర్కర్లకు ప్రికాషనరీ డోస్‌లు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆదివారం ఉదయం 7 గంటల వరకూ అర్హులైన వారికి 156 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చారు. గత 24 గంటల్లో 66 లక్షల వ్యాకినేషన్ డోస్‌లు వేశారు. ఇక, వచ్చే నెలాఖరు నుంచి 12 -15 ఏళ్ల వయసు గ్రూపు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీని పైన ఇప్పటికే అధ్యయనాలు సాగుతున్నాయి. ప్రస్తుత వ్యాక్సిన్ల ట్రయిల్స్ నిర్వహిస్తున్నారు. అన్నీ పూర్తయితే.. కేంద్రం అధికారికంగా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరిగి థర్డ్ వేవ్ విస్తరిస్తున్నా..లక్షలాది కేసులు నమోదవుతున్నా.. మరణాల సంఖ్య పెరగకపోవటం కొంత ఉపశమనంగా ఉంది. అయితే, భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ కారణంగానే మరణాల రేటు తగ్గుముఖం పట్టిందని నిపుణులు చెబుతున్నారు.

Latest News

 
ఓటేసి ప్రింట్ అవుట్ అడిగిన పవన్ కళ్యాణ్?!.. వీడియో వైరల్ Mon, May 13, 2024, 06:01 PM
ఓటరు చెంప చెల్లుమనిపించిన వైసీపీ ఎమ్మెల్యే.. రివర్స్‌లో అదే రేంజ్‌లో చెంప దెబ్బ Mon, May 13, 2024, 05:39 PM
కాసేపట్లో ముగియనున్న ఓటింగ్.. పోలింగ్‌పై చంద్రబాబు ఇంట్రస్టింగ్ ట్వీట్ Mon, May 13, 2024, 05:34 PM
పోలింగ్ కేంద్రంలో ఎర్రకండువా.. ఆగ్రహంతో ఊగిపోయిన వంగా గీత.. జనసేన స్ట్రాంగ్ కౌంటర్ Mon, May 13, 2024, 05:00 PM
వైసీపీకి విషయం అర్థమైంది.. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది Mon, May 13, 2024, 04:55 PM