టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ కు మరోసారి నిర్బంధం

by సూర్య | Sat, Jan 15, 2022, 04:23 PM

వివాదాలు ఎపుడు ఆయన వెంటాడుతుంటాయి. అందుకే ఆయన నిర్భంధాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వచ్చిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ కు మరోసారి నిర్బంధం తప్పలేదు. జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రెండోసారి కూడా రద్దు చేయగా, అధికారులు అతడిని కరోనా నిర్బంధ కేంద్రానికి తరలించారు. అసలు, జకోవిచ్ కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడమే ఈ చర్యలకు కారణమైంది. ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్లు తీసుకోని వారికి దేశంలో ప్రవేశం నిషిద్ధం. ఇప్పటికే ఓసారి జకోవిచ్ వీసాను రద్దు చేయగా, కోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేసింది. అయితే, ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అలెక్స్ హాక్ తన విశిష్ట అధికారాన్ని ఉపయోగించి జకోవిచ్ వీసాను రద్దు చేయడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఈ క్రమంలో అధికారులు జకోవిచ్ ను మెల్బోర్న్ లోని పార్క్ హోటల్ కు తరలించారు. ఈ హోటల్ ను కరోనా నిర్బంధ కేంద్రంగా వినియోగిస్తున్నారు. ఇదిలావుంటే ఈ వ్యవహారంపై సెర్బియా దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ ఉసిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెన్నిస్ యోధుడ్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం అవమానించిందని వ్యాఖ్యానించారు. "జకోవిచ్ ను ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ చరిత్రలో 10వ టైటిల్ ను గెలనివ్వరాదని అనుకుంటున్నారా? అలాగైతే అతడి వీసా రద్దు చేసినప్పుడు ఎందుకు వెనక్కి పంపలేదు? ఈ విషయంలో జకోవిచ్ కు మేం అండగా ఉంటాం" అని ఉద్ఘాటించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. కరోనా రక్కసిపై పోరాటంలో భాగంగా ఆస్ట్రేలియా ప్రజలు ఎన్నో త్యాగాలు చేయడమే కాకుండా, సుదీర్ఘకాలంలో నిర్బంధంలో గడిపారని వెల్లడించారు. వ్యాక్సిన్లు తీసుకోని జకోవిచ్ ను అనుమతించడం ద్వారా ప్రజల స్ఫూర్తిని దెబ్బతీయలేమని స్పష్టం చేశారు.  అటు, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి అలెక్స్ హాక్ స్పందిస్తూ, జకోవిచ్ ను అనుమతిస్తే వ్యాక్సిన్లపై ప్రజల్లో వ్యతిరేక భావన బలపడుతుందని అభిప్రాయపడ్డారు. దేశ పౌరుల్లో అనిశ్చితికి కారణమయ్యే ఏ అంశాన్నీ తాము ఉపేక్షించబోమని తెలిపారు. కాగా, జకోవిచ్ వీసా అంశంపై రేపు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో విచారణ జరగనుంది. హోటల్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జకోవిచ్ విచారణకు హాజరు కానున్నాడు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM