నాకు కరోనా...కలిసేందుకు రావద్దు

by సూర్య | Fri, Jan 14, 2022, 06:48 PM

తనకు కరోనా సోకిందని, తనను కలిసేందు ఎవరూ రావద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ కోరారు. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ అనే విషయం తెలియగానే ఆయన హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని మంత్రి సూచించారు అలాగే, తనను కలుసుకోవడానికి ఇంటి వద్దకు ఎవరూ రావద్దని మంత్రి కోరారు. అవసరమైతే ఫోన్ ద్వారా సంప్రదించాలని చెప్పారు. మరోవైపు వారం క్రితమే ఆయన రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అవంతి శ్రీనివాస్ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఫస్ట్ వేస్ సమయంలో కూడా ఆయనకు కరోనా సోకింది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. కొడాలి నాని, వంగవీటి రాధా తదితర నేతలకు ఇటీవలే కరోనా సోకింది.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM