ఏడుగురు భార‌త షట్ల‌ర్ల‌కు కొవిడ్

by సూర్య | Thu, Jan 13, 2022, 01:36 PM

సీని, క్రీడా రంగాలపై కరోనా పంజా విసిరింది. కరోనా దాడికి గురైన జాబితాలో ఇపుడడు బ్యాడ్మింటన్ రంగం కూడా చోటు చేసుకొంది. ఇండియా ఓపెన్ బ్యాడ్మింట‌న్ టోర్నీలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ఏడుగురు భార‌త షట్ల‌ర్ల‌కు కొవిడ్ సోకింది. ఈ టోర్నీ మొన్న‌ ప్రారంభమైంది. ఈ టోర్నీలో నేడు రెండో దశ మ్యాచ్‌లు జరగాల్సి ఉండ‌గా, ఆట‌గాళ్ల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. దీంతో స్టార్ ష‌ట్ల‌ర్ కిదాంబి శ్రీకాంత్‌ సహా ఏడుగురికి పాజిటివ్ గా తేలిన‌ట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) ఓ ప్రకటనలో తెలిపింది. క‌రోనా సోకిన కిదాంబి శ్రీ‌కాంత్‌తో పాటు అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్‌ థక్కర్, ట్రెస్సా జోలీ, మిథున్‌ మంజునాథ్‌, సిమ్రన్‌ అమాన్‌ సింఘీ, కుషి గుప్తాను ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రానికి త‌ర‌లించిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఏడుగురు షట్ల‌ర్ల‌ డబుల్స్‌ పార్ట్‌నర్ల‌ను కూడా టోర్నీ నుంచి నిష్క్ర‌మింప‌జేసిన‌ట్లు తెలిపింది. ఆ ఏడుగురు ష‌ట్ల‌ర్ల‌తో త‌ల‌ప‌డాల్సిన ష‌ట్ల‌ర్లను నేరుగా తదుపరి రౌండ్లకు ప్రమోట్‌ చేస్తున్న‌ట్లు బీడబ్ల్యూఎఫ్ ప్ర‌క‌టించింది. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) కూడా ఈ విష‌యాన్ని ధ్రువీకరించింది. కాగా, ఇటీవ‌లే సాయి ప్రణీత్‌కు కూడా కరోనా సోక‌డంతో ఆయ‌న టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అలాగే, ఈ టోర్నీలో ఆడాల్సిన‌ ఇంగ్లాండ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారులకు కూడా క‌రోనా సోకింది. దీంతో ఇంగ్లాండ్‌ జట్టు ఈ టోర్నీ నుంచి ఇప్ప‌టికే తప్పుకుంది. భారీ క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌డంతో ఈ టోర్నీ నిర్వహణపై సందేహాలు వ‌స్తున్నాయి. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. క‌రోనా నియంత్ర‌ణ కోసం జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఏడుగురికి వైర‌స్ సోక‌డంతో ఈ టోర్నీని ర‌ద్దు చేస్తార‌న్న ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM