ఏమీ వాడుతున్నారో చెప్పండి:ఆనందయ్యకు ఆయూష్ నోటీసులు
 

by Suryaa Desk |

ఏమీ వాడుతున్నారో చెప్పండి:ఆనందయ్యకు ఆయూష్ నోటీసులు ఒమిక్రాన్ మొదలు తాను దానికి మందు కనిపెట్టానని చెబుతున్న ఆనందయ్య అంశం ఓ వివాదంగానే మారింది. కరోనా వైరస్ మన దేశంలోకి ఎంటరైన తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాప్యులర్ అయిన వ్యక్తి ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య. కరోనాకు ఆయన తయారు చేసిన ఆయుర్వేద మందు పెను సంచలనం అయింది. మద్రాస్ హైకోర్టు సైతం ఆయన మందును తయారు చేసి ఉచితంగా అందిస్తున్న వైనాన్ని కొనియాడింది. అయితే, తాజాగా ఆయనపై ఆయుష్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా ఒమిక్రాన్ మందు అంటూ పంపిణీ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. మందు పంపిణీకి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఒమిక్రాన్ మందుకు ఏయే పదార్థాలు వాడుతున్నారో చెప్పాలని ఆదేశించింది. మీరు ఇచ్చే సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పింది. మీరు పంపిణీ చేస్తున్న మందుకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ ను 48 గంటల్లో నయం చేస్తామని మందులు ఇస్తున్నారని... ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM