ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రెండో ఘాట్‌ రోడ్డు

by సూర్య | Tue, Jan 11, 2022, 11:21 AM

తిరుమల వెళ్లే భక్తులకు రెండో ఘాట్‌ రోడ్డు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. ఘాట్‌ రోడ్డుపై ఈరోజు రాత్రి నుంచి వాహనాలను అధికారులు అనుమతించనున్నారు.భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రెండో ఘాట్‌ రోడ్డు మరమ్మత్తులు పూర్తయ్యాయి.నిన్ననే వాహనాలను అనుమతించాల్సి ఉన్నప్పటికీ.. అధికారులు నేటికి వాయిదా వేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఈ ఘాట్ రోడ్డును పునఃప్రారంభిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.తిరుమలలో దెబ్బతిన్న రోడ్డు మరమ్మతు పనులను టీటీడీ యుద్ధప్రాతిపదికన చేపట్టి నెల రోజుల్లో పూర్తి చేసింది. దెబ్బతిన్న ఘాట్ రోడ్డు పునరుద్ధరణపై నిపుణుల అభిప్రాయాన్ని సేకరించేందుకు టీటీడీ ఐఐటీ, న్యూఢిల్లీ, చెన్నై, అమృత విశ్వ విద్యాపీఠం, కొల్లం, కేరళ నుంచి నిపుణులను తీసుకొచ్చారు.


రెండో ఘాట్‌ రోడ్డులో జరుగుతున్న నిర్మాణ పనులను ఇదివరకే టీటీడీ చైర్మన్‌ పరిశీలించారు. ఘాట్‌ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టిన ఏఎఫ్‌కాన్‌ ఇంజనీర్ల బృందంతో ఆయన మాట్లాడి పనులు పూర్తి చేసి నేటి నుంచి యాత్రికులకు రోడ్డు వినియోగంలోకి వచ్చేలా చూడాలన్నారు.


 


 

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM