వ్యక్తి పై కత్తితో దాడి...!
 

by Suryaa Desk |

పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు మదివాడకు చెందిన శెట్టిపల్లి గణేష్‌పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. బాధితుడు గణేష్ కేకలు వేయడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. గణేష్ కేకలు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం దాడి చేసిన వారిని వంగా విజయ్ కుమార్, మద్దిరాల పాండుగా పోలీసులు గుర్తించారు. అల్లర్ల నేపథ్యంలోనే కత్తితో దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM