సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

by సూర్య | Mon, Nov 22, 2021, 10:28 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంచార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామాల్లో పర్యటించి తక్షణమే ప్రజలకు ఆదుకునేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం జగన్ ఆదేశించారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం, డ్రైనేజీ పనులు, ముంపు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్, సరుకుల పంపిణీలో జరిగిన నష్టాన్ని పక్కాగా అంచనా వేయాలన్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా గతంలో ప్రకటించిన విధంగా విత్తనాలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావద్దని, వారి ప్రాంతంలోనే ఉండి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని సీఎం జగన్ సూచించారు.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM