తిరుపతిలో కుంభవృష్టి.. . స్తంభించిపోయిన జనజీవనం

by సూర్య | Thu, Nov 18, 2021, 04:34 PM

తిరుపతిలో నేటి ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. దానితో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని కూడళ్లు చెరువులను తలపిస్తున్నాయి. తిరుపతితో పాటు జిల్లాలోని తూర్పు మండలాలైన శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కెవిబిపురం, వరదయ్యపాలెం, సత్యవేడు, నారాయణపురం, బిఎన్. కండ్రిగ రేణిగుంట తదితర మండలాల్లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. . ఇక తిరుమల కొండపై కూడా భారీ వర్షం పడింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని గ్రహించి టీటీడీ..కాలినడక మార్గం క్లోజ్ చేసింది. ఘాట్ రోడ్ లో కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు తిరుపతి బస్టాండ్ నీట మునిగింది. వర్షాల కారణంగా పలు బస్సులు బస్టాండ్ కే పరిమితమయ్యాయి.  భారీ వర్షాల కారణంగా గాల్లో ఓ గంట పాటు విమానాలు చక్కర్లు కొట్టాయి. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 1.30 గంటలకు ల్యాండ్ కావాల్సిన ఎయిర్ ఇండియా విమానం A1542(A321) ఆకాశంలో చక్కర్లు కొట్టి హైదరాబాద్ కు ప్రయాణం అయ్యింది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 1.40 గంటకు తిరుపతి చేరుకోవాల్సిన ఇండిగో విమానం 6E2005(A22N) కూడా చక్కర్లు కొట్టి బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యింది. ఈ బారి వర్షాల కారణంగాఈ విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM