నేడు 'వెస్టిండిస్ - దక్షిణాఫ్రికా' బిగ్ ఫైట్.. సెమీస్ కి విజయం తప్పనిసరి

by సూర్య | Tue, Oct 26, 2021, 02:58 PM

అక్టోబర్ 26న మంగళవారం రోజున దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వెస్టిండిస్ - దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మ్యాచ్ తో మరో బిగ్ ఫైట్ కి వేదిక కానుంది. ఇప్పటికే గ్రూప్ 1 లో వెస్టిండిస్ జట్టు తన మొదటి మ్యాచ్ ని ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోగా, దక్షిణాఫ్రికా జట్టు టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమితో మొదలుపెట్టింది. తాజాగా గ్రూప్ 1 నుండి సెమీస్ కి చేరాలంటే ఇరు జట్లకు ఈరోజు మ్యాచ్ విజయం తప్పనిసరిగా మారింది.


డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన వెస్టిండిస్ పేలవ బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి నుండి తేరుకొని ఈ రోజు దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ లో తమ సత్తాచాటి గెలుపొందాలని పట్టుదలతో ఉండగా దక్షిణాఫ్రికా జట్టు మాత్రం ఓపెనర్ క్వింటన్ డికాక్, మిడిల్ ఆర్డర్ కేశవ్ మహారాజ్ ల బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉంది. ఇక ఇప్పటివరకు దక్షిణాఫ్రికా - వెస్టిండిస్ మధ్య 15 టీ20 మ్యాచ్ లు జరగగా అందులో దక్షిణాఫ్రికా 9, వెస్టిండిస్ 6 మ్యాచ్ లలో గెలుపొందింది. నేడు జరగబోయే ఇరు జట్ల తుది వివరాలు ఇలా ఉండనున్నాయి..


దక్షిణాఫ్రికా జట్టు:


టెంబా బావుమా, క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ


వెస్టిండిస్ జట్టు:


లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, రోస్టన్ చేజ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ , కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, ఒబెడ్ మెక్‌కాయ్, రవి రాంపాల్

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM