లఖింపూర్ కేసు సాక్షులకు భద్రత కల్పించండి: సుప్రీంకోర్టు

by సూర్య | Tue, Oct 26, 2021, 01:48 PM

లఖింపూర్ కేరి ఘటన కేసులో సాక్షులకు భద్రత కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే శ్యామ్‌ సుందర్, పాత్రికేయుడు రమన్ కశ్యప్ మృతికి సంబంధించి స్థాయి నివేదకను కూడా తమకు సమర్పించాలని ఆదేశించింది. మంగళవారం లఖింపూర్ కేసుకు సంబంధించి విచారణ కొనసాగింది.


ఈ కేసులో 68 మంది సాక్షుల్లో 30 మంది నుంచి 164 స్టేట్‌మెంట్లు రికార్డు చేశామని, వారిలో 23 మంది ప్రత్యక సాక్షులని కోర్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. దీనిపై కోర్టు స్పందిస్తూ, ఘటన వీడియోలకు సంబంధించిన నివేదిక ప్రక్రియను ఫోరెన్సిక్ ల్యాబ్‌లు వేగవంతం చేయాలని ఆదేశించింది. అలాగే, సాక్షుల రికార్డును కూడా వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటన సమయంలో 4 నుంచి 5 వేల మంది స్థానికులు ఉన్నప్పుడు, ఘటన అనంతరం కూడా వీరిలో ఎక్కువ మంది ఆందోళనకు దిగినప్పుడు, వారిని గుర్తుపట్టడం పెద్ద సమస్య కాదని చెప్పింది.తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

Latest News

 
ఏపీలో మరో ఘోరం.. చిత్తూరు జిల్లాలో రెండులారీలు, ట్రాక్టర్ ఢీ. Wed, May 15, 2024, 11:24 PM
వైఎస్ జగన్ నివాసంలో ముగిసిన 41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగం Wed, May 15, 2024, 11:19 PM
రూ.3500 సాయం అడిగింది నేనే.. నా అకౌంట్ హ్యాక్ కాలేదు: రేణూ దేశాయ్ Wed, May 15, 2024, 09:50 PM
ఏపీలో మరో మూడురోజులు వానలు.. రేపు ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ Wed, May 15, 2024, 09:49 PM
ఏపీలోని ఈ నియోజకవర్గాల్లో 144 సెక్షన్.. ప్రజల్ని అలర్ట్ చేసిన పోలీసులు Wed, May 15, 2024, 08:38 PM