ఆంధ్రప్రదేశ్‌లో 151 ఉద్యోగాలు... నేడే దరఖాస్తుకు చివరి తేదీ

by సూర్య | Mon, Oct 25, 2021, 02:42 PM

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్  విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 151 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది ఏపీపీఎస్‌సీ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 25 చివరి తేదీ. రాత పరీక్షల తేదీలను ఏపీపీఎస్‌సీ తర్వాత ప్రకటిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.


 ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు 151 విద్యార్హతలు


మెడికల్ ఆఫీసర్ (యునానీ) 26 యునానీలో డిగ్రీ పాస్ కావాలి. ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్ ఉండాలి.


మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) 53 హోమియోపతిలో డిగ్రీ పాస్ కావాలి. ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్ ఉండాలి.


మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) 72 ఆయుర్వేదలో డిగ్రీ పాస్ కావాలి. ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్ ఉండాలి.


APPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 4


దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 25


విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.


వయస్సు- 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లలోపు ఉండాలి.


దరఖాస్తు ఫీజు- రూ.250 ప్రాసెసింగ్ ఫీజు, రూ.120 ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.120 ఎగ్జామ్ ఫీజు మినహాయింపు లభిస్తుంది.


ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్


మెడికల్ ఆఫీసర్ (యునానీ) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


 అప్లై చేయండి ఇలా


Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.


Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.


Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.


Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.


Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.


Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.


Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.


Step 8- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.


Step 9- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.


Step 10- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Thu, May 09, 2024, 11:43 PM
రేపు ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు Thu, May 09, 2024, 10:15 PM
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించాల్సిందే : సీఎం జగన్ Thu, May 09, 2024, 09:45 PM
రూ.8.39 కోట్ల నగదు సీజ్ Thu, May 09, 2024, 06:20 PM
రోడ్ షో నిర్వహించిన టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు Thu, May 09, 2024, 06:16 PM