అధికారంలోకి వస్తే రూ 10 లక్షల వరకూ ఉచిత వైద్యం : ప్రియాంక గాంధీ

by సూర్య | Mon, Oct 25, 2021, 02:22 PM

వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హామీల వర్షం కొనసాగుతోంది. తాము అధికారం చేపట్టగానే విద్యార్ధినులకు స్మార్ట్‌ఫోన్లు, స్కూటీలు అందిస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని, 20 లక్షల ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి తీసుకువస్తామని పలు హామీలు గుప్పించిన ప్రియాంక గాంధీ తాజాగా మరో కీలక వాగ్ధానం చేశారు.


అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ 10 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్స అందిస్తామని ప్రకటించారు. కొవిడ్‌-19 బాధితులకు ఊతంగా బాధిత కుటుంబానికి రూ 25,000 పరిహారం ఇస్తామని ఆమె ఇప్పటికే వెల్లడించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లు మహిళలకు కేటాయిస్తామనీ ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే.

Latest News

 
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా? Fri, May 03, 2024, 04:04 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది Fri, May 03, 2024, 04:03 PM
చంద్ర‌బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలే Fri, May 03, 2024, 04:03 PM
ఒక హామీ అప్పుడే మాయమైనది Fri, May 03, 2024, 04:02 PM
కార్మికులకు భధ్రత కల్పించింది వైసీపీ ప్రభుత్వమే Fri, May 03, 2024, 04:02 PM