టీమిండియా ఆటగాళ్లకు స్లీపింగ్‌ పిల్స్‌ ఇవ్వండి : షోయబ్‌ అక్తర్‌

by సూర్య | Sun, Oct 24, 2021, 01:05 PM

పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమకాలీన క్రీడా విశేషాలపై తన అభిప్రాయాలు పంచుకుంటూ అభిమానులకు చేరువగా ఉంటాడు. తన యూట్యూబ్‌ చానెల్‌లో వీడియోలు షేర్‌ చేయడం సహా ఇతర చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతాడు. ఇక టీ20 వరల్డ్‌కప్‌-2021లో భాగంగా నేడు(అక్టోబరు 24)న చిరకాల ప్రత్యర్థులు ఇండియా- పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌తో ట్రోఫీ కోసం వేట ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు ఈ టోర్నీలో టీమిండియానే పాక్‌పై ఆధిక్యంలో ఉంది. ఆడిన 5 మ్యాచ్‌లలోనూ దాయాదిని మట్టికరిపించి సత్తా చాటింది.


ఈ నేపథ్యంలో షోయబ్‌ అక్తర్‌ పాకిస్తాన్‌ జట్టుకు అదిరిపోయే ఓ ఫన్నీ ఐడియా ఇచ్చాడు. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. బాబర్‌ ఆజం జట్టు... మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వాలంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. అప్పుడే పాక్‌ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అంతేకాదు... టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగించడం ఆపేయాలని విజ్ఞప్తి చేసిన అక్తర్‌... మెంటార్‌ ఎంఎస్‌ ధోని బ్యాటింగ్‌కు రావొద్దంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


ఈ మేరకు.. ''టీమిండియాకు స్లీపింగ్‌ పిల్స్‌ ఇవ్వండి. విరాట్‌ కోహ్లి... నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌ వాడటం మానేయాలి. ఇక ఎంఎస్‌ ధోని బ్యాటింగ్‌కు రాకూడదు. ఎందుకంటే.. ఇప్పటికీ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ అతడు'' అంటూ సరాదాగా సంభాషించాడు. ఇక పాకిస్తాన్‌ జట్టు గురించి మాట్లాడుతూ.. నెమ్మదిగా ఆరంభించినా.. 5 ఓవర్ల తర్వాత దూకుడు పెంచాలని బ్యాటర్లకు సూచించాడు. ఇక మంచి స్కోరు నమోదు చేసినట్లయితే... వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని దెబ్బకొట్టాలని సూచించాడు. 

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM