ఇంట్లోనే ప్రొటీన్‌ షేక్ తయారీ ఇలా చేసుకోండి..!

by సూర్య | Sat, Oct 23, 2021, 04:48 PM

శారీరక ధృడత్వం కావాల్సిన వారు కచ్చితంగా ప్రొటీన్‌ షేక్ తాగాలి. కానీ ఇవి చాలా ఖరీదైనవి. అయితే మీరు ఇంట్లో ఉండి కూడా ప్రొటీన్ షేక్ తయారు చేసుకోవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సన్నగా ఉన్నవారికి ప్రొటీన్‌ షేక్ చాలా మంచిది. అంతేకాదు బరువు కూడా తొందరగా పెరుగుతారు. ఇంట్లో తయారు చేసిన ఈ ప్రొటీన్‌ షేక్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత ప్రతిరోజూ ప్రోటీన్ షేక్ తీసుకుంటే చాలా మంచిది.


ఇంట్లో ప్రోటీన్ షేక్ ఎలా సిద్ధం చేయాలి


మీరు ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ప్రొటీన్‌ షేక్‌ని సులభంగా తయారుచేసుకోవచ్చు.ఈ ప్రత్యేక షేక్ చేయడానికి మీకు పాలు, అవిసె గింజల పొడి, చాక్లెట్ పౌడర్ అవసరం. అయితే మీరు అవిసె గింజల పొడిని కలిగి ఉండకపోతే దాని విత్తనాల నుంచి ఇంట్లో పొడిని సులువుగా తయారు చేసుకోవచ్చు.


షేక్ ఎలా చేయాలి


ఈ ప్రోటీన్ షేక్ చేయడానికి గ్రైండర్‌లో పాలు, అవిసె గింజల పొడి, చాక్లెట్ పౌడర్‌ను వేసి కనీసం 5 నిమిషాలు స్విచ్‌ ఆన్ చేయాలి. ఈ మూడు బాగా మిక్స్ అయ్యాక ఒక గ్లాసులో తీసుకుని తాగాలి. ఈ తాజా ప్రోటీన్ షేక్ మీ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో తయారుచేసిన ఈ షేక్‌ని వ్యాయామం చేసిన తర్వాత, తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.


ఇది కాకుండా ప్రయోజనకరమైన మరొక షేక్ ఉంది. దీని కోసం మీకు 1 అరటిపండు, 1 కప్పు పాలు, 1 టేబుల్ స్పూన్ బాదం పొడి, 2 టేబుల్ స్పూన్లు డార్క్ చాక్లెట్ అవసరం. ముందుగా అరటిపండును చిన్న ముక్కలుగా కట్ చేసి, ఆపై డార్క్ చాక్లెట్, బాదం పొడి వేసి బాగా కలపాలి. దీని తరువాత పాలు వేసి మిక్సర్‌తో మళ్లీ కలపాలి. తర్వాత గ్లాసులో తీసుకొని తాగాలి. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు పెంచడంలో తోడ్పడుతుంది.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM