అక్కడ మహిళలకు టాయిలెట్లు కూడా లేవు!:సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

by సూర్య | Sat, Oct 23, 2021, 04:40 PM

‘దేశంలోని చాలా కోర్టులు శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లోనే పనిచేస్తున్నాయి. దీని వల్ల న్యాయమూర్తులు సమర్థంగా పనిచేయలేకపోతున్నారు. ఫలితంగా బాధితులకు సత్వర న్యాయం అందడం లేదు. దేశంలోని మొత్తం న్యాయస్థానాల్లో కేవలం 5 శాతం కోర్టుల్లోనే ప్రాథమిక చికిత్సా సదుపాయం ఉంది. 26 శాతం కోర్టుల్లో మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవు.


 16 శాతం కోర్టుల్లో పురుషులకు కూడా టాయిలెట్స్‌లేని పరిస్థితి. 50 శాతం న్యాయస్థానాల్లో లైబ్రరీలు లేవు. ఇంకా 46 శాతం వాటిల్లో కనీసం తాగునీటి సౌకర్యం లేదు. న్యాయస్థానాల్లో మెరుగైన వసతుల కల్పనకు కేంద్ర న్యాయశాఖ చొరవ చూపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ప్రతిపాదనకు సంబంధించిన బిల్‌ను రాబోయే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేలా కేంద్ర న్యాయ శాఖ మంత్రి చొరవ చూపాలని కోరుతున్నాను ‘ అని సీజేఐ చెప్పుకొచ్చారు. కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనపై ఎన్వీ రమణ ఇలా మాట్లాడడం ఇది రెండోసారి. గతంలో కూడా ఓ కార్యక్రమంలో ఆయన ఇలాగే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM