ఏపీలో కరోనా అప్డేట్

by సూర్య | Sat, Oct 23, 2021, 04:36 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో .. కరోనా మహమ్మారి కేసులు.. పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన కరోనా మహమ్మారి కేసులు… ఇవాళ తగ్గుముఖం పట్టాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 396 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,63, 177 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 6 గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 339 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5222 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో 566 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 40, 855 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 92, 26 , 511 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,43, 616 లక్షలకు చేరింది.

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM