భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

by సూర్య | Sat, Oct 23, 2021, 10:38 AM

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 16,326 కరోనా కేసులు నమోదయ్యాయి. 17,677 మంది కోవిడ్ మహమ్మారి నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 666 మరణాలు నమోదయ్యాయి.తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్త కరోనా కేసుల సంఖ్య 3,41,59,562కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,35,32,126 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,53,708 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 1,73,728 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 666 మరణాలు నమోదవడంతో ఆందోళన నెలకొంది.ఐతే వీరంతా నిన్న ఒక్కరోజే మరణించిన వారు కాదు. కేరళలో గతంలో నమోదైన మరణాలను నిన్న సవరించడంతో... మొత్తం 563 మరణాలు అదనంగా చేరాయి. ఈ క్రమంలోనే మొత్త మరణాల సంఖ్య పెరిగినట్లుగా కనిపిస్తోంది.కేరళలో కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 9,361 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేరళలో 81,490 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Latest News

 
మద్యం అక్రమ రవాణా బాగా పెరిగింది Tue, Apr 30, 2024, 05:51 PM
నేడు రెండు చోట్ల బాలకృష్ణ సభలు Tue, Apr 30, 2024, 05:50 PM
మైనింగ్ జరుపుకునే వెసులుబాటు కల్పించాలి Tue, Apr 30, 2024, 05:49 PM
వైసీపీ నేతలకు తెలిసింది రౌడీయిజమే Tue, Apr 30, 2024, 05:49 PM
వైసీపీ మేనిఫెస్టో మోసాల పుట్ట Tue, Apr 30, 2024, 05:48 PM