23న విశాఖ పర్యటించనున్న సీఎం జగన్‌.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం

by సూర్య | Fri, Oct 22, 2021, 09:18 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నగరానికి రానున్నారు. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పూర్తి చేసిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 4.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 4.55 నుంచి 5.15 గంటల వరకు ఎయిర్‌పోర్టు గేట్‌-1లో ప్రజాప్రతినిధులు, నాయకులతో ఇంటరాక్షన్‌ ఉంటుంది.


అనంతరం 5.20-5.35 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఫ్లైఓవర్‌తో పాటు వీఎంఆర్‌డీఏ పూర్తి చేసిన 6 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి బయలుదేరి 5.55 గంటలకు వుడాపార్క్‌కు చేరుకుంటారు. అక్కడ వుడాపార్క్‌తో పాటు జీవీఎంసీ పూర్తి చేసిన 4 స్మార్ట్‌ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తరువాత ఎంజీఎం పార్కులో జరగనున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరై వధూవరుల్ని ఆశీర్వదించనున్నారు. రాత్రి 6.35 గంటలకు ఎంజీఎం పార్కు నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 7.10 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు.

Latest News

 
నేడు కమలాపురం నియోజకవర్గంలో వైయస్ షర్మిల ప్రచారం Tue, May 07, 2024, 10:27 AM
వరదయ్యపాళెంలో గడ్డివామి దగ్ధం Tue, May 07, 2024, 10:19 AM
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM