ఆ చెట్ల కింద నిలబడితే ఆస్పత్రికే!

by సూర్య | Fri, Oct 22, 2021, 06:48 PM

పచ్చదనం మాట తర్వాత చెట్ల వల్ల ప్రాణాలు పోతాయామోనని ప్రజలు భయపడిపోతున్నారు. గాలీ పీల్చాలంటే టెన్షన్ పడుతున్నారు. ఇదంతా విఖపట్నంలో జరుగుతుంది. కొన్ని చెట్లతో అక్కడి జనం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నాటిన ఏడాకుల చెట్ల వల్ల ఈ పాట్లు వచ్చాయి. ఆ చెట్ల నుంచి వస్తున్న వాసన పీల్చడంతో అనారోగ్యానికి గురవుతున్నామంటూ విశాఖవాసులు గగ్గోలు పెడుతున్నారు. హుద్‌హుద్ తుఫాన్ వల్ల అక్కడ చెట్లన్నీ కుప్పకూలిపోతే.. అధికారులు గ్రీన్ ప్రాజెక్ట్ చేపట్టి.. నగరంలోని రహదారుల్లో ఏడాకుల చెట్లను నాటారు. ఆల్‌ స్టోనియా స్కోలరీస్‌ అనే శాస్త్రీయ నామమున్న ఏడాకుల మొక్కలను ఐదు లక్షలకు పైగా నాటారు. ఇవి అతి తక్కువ కాలంలో ఏపుగా పెరిగిన ఈ మొక్కలు పూత దశకు వచ్చాయ్. అయితే ఈ చెట్ల కింద నిలబడితే తలనొప్పి, శ్వాసకోస సంబంధ వ్యాధులు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. దాంతో ప్రజలు ఈ డెవిల్ ట్రీలను తొలగించాలని కోరుతున్నారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM