19 ఏళ్ల యువతి ఆత్మహత్య..రేపిస్టుని పట్టించిన స్పెర్మ్ కణాలు

by సూర్య | Sun, Jun 13, 2021, 12:59 PM

19 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడిందన్న కేసులో విచారణ జరుపుతున్న గుజరాత్‌లోని వడోదర పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు వెలుగుచూశాయి. మహిళ గర్భాశయం ప్రాంతంలో స్పెర్మ్ కణాలు ఉన్నట్లు శవపరీక్ష నివేదికలో తేలింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు, ఫుడ్ డెలివరీ కంపెనీలో వారి సహోద్యోగి అయిన బాధితురాలిని జూన్ 8 న ఒక ప్రైవేట్ పార్టీలో మద్యం సేవించమని బలవంతం చేశారని, ఆపై వారిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. జూన్ 10 ఉదయం తన ఇంట్లో యువతి ఉరి వేసుకుని మరణించింది. ఈ మేరకు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఆత్యహత్య కేసు నమోదు చేయడానికి కుటుంబ సభ్యులు మమ్మల్ని సంప్రదించినప్పుడు, తండ్రితో విభేదాల కారణంగా ఆమె వేరుగా నివసిస్తున్నట్లు తెలిసింది. దీంతో మాకు అనుమానం కలిగింది. ఆమెకు ఏమి ఇబ్బందులు ఉన్నాయో తెలియదని కుటుంబం తెలిపింది. శవపరీక్ష సమయంలో నిర్దిష్ట ఫోరెన్సిక్ పరీక్ష చేయాలని నిపుణులను అడిగాము. పోస్టుమార్టం చేసిన టీమ్ ఆమె గర్భాశయ ప్రదేశంలో స్పెర్మ్ కణాల ఉనికిని గుర్తించింది. ఆ తరువాత, మేము లైంగిక వేధింపుల కోణం నుండి కేసును విచారించాము. ఆ తర్వాత నిందితుల గురించి తెలిసింది" అని కేసును విచారిస్తున్న ఇన్స్పెక్టర్ తెలిపారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM