పోలాండ్ ఓపెన్‌లో స్వర్ణం సాధించిన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌

by సూర్య | Sat, Jun 12, 2021, 11:32 AM

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ పోలాండ్ ఓపెన్‌లో 53 కిలోల బంగారు పతకం సాధించారు. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఆమె సత్తాచాటింది. ఈ సీజన్‌లో ఆమెకు ఇది మూడో టైటిల్, 26 ఏళ్ల వినేష్, మార్చిలో మాటియో పెలికాన్, ఏప్రిల్‌లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. ఈ విజయంతో, వినేష్ టోక్యో ఒలింపిక్స్‌లో టాప్ సీడ్ రెజ్లర్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది ఫోగట్. మహిళల 53 కేజీల ఫైనల్లో వినేశ్‌ 8-0తో క్రిస్టీనా బెరెజా "ఉక్రెయిన్‌ " పై విజయం సాధించింది. ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన ఫోగట్‌.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ప్రారంభంలో, 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత ఎకాటెరినా పోలేష్‌చుక్‌ మాత్రమే వినేష్‌ని ఇబ్బంది పెట్టింది.


పోలేష్‌చుక్‌పై 6-2 తేడాతో విజయం సాధించగా, పోడియంలో అగ్రస్థానానికి చేరుకోవడానికి కేవలం ఈ రెండు పాయింట్లు మాత్రమే ఆమె కోల్పోయింది. ఫైనల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిస్టినా బెరెజాపై ఒక్క పాయింట్ కూడా కోల్పోలేదు. వినేష్ ‘డబుల్ లెగ్ అటాక్’తో ఎక్కువ పాయింట్లు సాధించింది. అమెరికా ప్రత్యర్థి అమీ ఆన్ ఫెర్న్‌సైడ్‌ను సెమీఫైనల్లో కేవలం 75 సెకన్లలో పిన్ చేసింది. అంతకుముందు జ్వరం, కోవిడ్ లక్షణాలతో 57 కేజీల విభాగంలో ఇండియన్ రెజ్లర్ అన్షు మాలిక్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవలసి వచ్చింది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM