ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్ కి చేరిన జొకోవిచ్‌

by సూర్య | Sat, Jun 12, 2021, 11:15 AM

వరల్డ్‌ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ నొవాక్​ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్​ సెమీఫైనల్​లో స్పెయిన్ స్టార్‌ రఫెల్ నాదల్​ను మట్టికరిపించాడు. 16 సంవత్సరాల్లో ఫ్రెంచ్​ ఓపెన్​లో నాదల్ ఇప్పటివరకు 13 సార్లు ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ గెలుచుకోగా.. మూడోసారి ఓటమిపాలయ్యాడు. నాలుగు గంటలకుపైగా సాగిన ఈ హోరాహోరీగా పోరులో 3-6, 6-3, 7-6 (7/4), 6-2 తేడాతో జొకోవిచ్‌ విజయం సాధించాడు.


తద్వారా రొలాండ్‌ గారోస్‌(ఫ్రెంచ్‌ ఓపెన్‌)లో నాదల్​ను రెండు సార్లు ఓడించినా ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో గ్రీస్ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్​తో తలపడనున్నాడు. జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌పై జ్వెరెవ్‌పై 6-3, 6-3, 4-6, 4-6, 6-3 తేడాతో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న తొలి గ్రీకు ఆటగాడిగా సిట్సిపాస్ నిలిచాడు. ఫ్రెంచ్ రాజధానిలో జరిగిన 14 సెమీ ఫైనల్స్‌ మ్యాచుల్లో నాదల్‌కు ఇది మొదటి ఓటమి. పారిస్‌లో జరిగిన ఎనిమిది మ్యాచుల్లో నాదల్‌తో జొకోవిచ్‌ తలపడగా.. ఇందులో రెండు విజయాలు, ఫైనల్స్‌లో మూడు ఓటమలు ఉన్నాయి.

Latest News

 
ముసలోడే కానీ మహానుభావుడు.. స్కూటీలోనే దుకాణమెట్టేశాడు.. పోలీసులే షాక్ Fri, May 03, 2024, 07:47 PM
విజయవాడ సెంట్రల్ బరిలో కవి జొన్నవిత్తుల.. ఎందుకు పోటీ చేస్తున్నారో తెలుసా Fri, May 03, 2024, 07:43 PM
ఏపీలోని రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే.. వందల కోట్లల్లో ఆస్తులు.. టాప్ 5లో అంతా వాళ్లే Fri, May 03, 2024, 07:40 PM
షర్మిల, సునీత పిటిషన్లపై హైకోర్టు విచారణ.. కడప కోర్టుకు కీలక ఆదేశాలు Fri, May 03, 2024, 07:37 PM
ముద్రగడకు ఇంటిపోరు.. పవన్‌కు మద్దతుగా కూతురు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు Fri, May 03, 2024, 07:34 PM