నేటి నుంచే మద్యం హోమ్ డెలివరీ..!

by సూర్య | Fri, Jun 11, 2021, 03:35 PM

దేశరాజధాని ఢిల్లీలో మద్యం హోం డెలివరీలు 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే..ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కరోనా కేసులు తగ్గుతుండటంతో.. ఇంటికే మద్యం విక్రయాలను అనుమతిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ సాయంతో మద్యం ఆన్‌లైన్‌లో ఆర్డరు చేస్తే చాలు హోం డెలివరీ చేసేందుకు అనుమతినిస్తూ జూన్ 1న ఢిల్లీ సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. మద్యం ప్రియుల ఇళ్ల వద్దకే మద్యాన్ని డెలివరీ చేసేందుకు మద్యం వ్యాపారులకు ఆ నోటిఫికేషన్‌లో అనుమతించింది సర్కారు.


– ఢిల్లీ కొత్త ఎక్సైజ్‌ చట్టం-2021 ప్రకారం మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసినవారికి మద్యం షాపులు హోం డెలివరీ చేయనున్నారు. – పాత ఎక్సైజ్‌ చట్టం నిబంధనల ప్రకారం.. ఎల్-13 లైసెన్స్ ఉన్న మద్య షాపులు మాత్రమే ఇ-మెయిల్, ఫ్యాక్స్ ద్వారా లిక్కర్‌ ఆర్డర్ వస్తే హోం డెలివరీలను నిర్వహించేవి.


– ఎల్-14 లైసెన్స్ ఉన్న మద్యం అమ్మకందారులకు హోం డెలివరీకి అనుమతి ఉంది.


– ప్రస్తతం ఢిల్లీ అబ్కారీ శాఖ ప్రకటన ప్రకారం.. ఎల్-13 లైసెన్సు ఉన్న షాపులు మద్యాన్ని హోం డెలివరీ చేయవచ్చు.


– అయితే…ఆర్డర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా జరగాల్సిందే.


– హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలలో ఉండే వారికి మాత్రం మద్యం హోం డెలివరీ తీసుకునే అవకాశం లేదు.


– ఎల్-13 లైసెన్సు లేని వారు మద్యం హోం డెలివరీ చేయకూడదు.


– ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోనూ మద్య హోండెలివరీకి ప్రభుత్వం అంగీకరించింది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM