పాకిస్థాన్ సూపర్ లీగ్‌: 5 వికెట్లు తీసిన రషీద్ ఖాన్‌

by సూర్య | Fri, Jun 11, 2021, 03:06 PM

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ అయిదు వికెట్లు తీసుకున్నాడు. లాహోర్ క్వలాండర్స్ తరపున ఆడుతున్న అతను.. పెషావర్ జల్మీ బ్యాట్స్‌మెన్‌ను కుప్పకూల్చాడు. గురువారం అబుదాబిలోని షేక్ జయిద్ క్రికెట్ స్టేడియంలో జరిగిన పీఎస్ఎల్ మ్యాచ్‌లో లాహోర్ జట్టు పది పరుగుల తేడాతో పెషావర్ జల్మీపై విజయం సాధించింది. కీలకమైన రెండు పాయింట్లు సాధించిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో పది పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ క్వలాండర్స్ నిర్ణీత ఓవర్లలో 170 రన్స్ చేసింది. ఆ జట్టులో టిమ్ డేవిడ్ 64, బెన్ డంక్ 46 రన్స్ చేశారు. ఆ తర్వాత 171 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్‌కు ఆరంభం నుంచే సమస్యలు ఎదురయ్యాయి. మేటి బౌలర్ రషీద్ ఖాన్ ఆ జట్టును చావు దెబ్బతీశాడు. కీలకమైన దశలో వికెట్లను తీసి పెషావర్‌ను అడ్డుకున్నాడు. రషీద్ ఖాన్ 20 పరుగులు ఇచ్చి కీలకమైన 5 వికెట్లు తీసుకున్నాడు. 

Latest News

 
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. దర్శనానికి సంబంధించి వచ్చే నెల వరకు అద్భుత అవకాశం Fri, May 03, 2024, 09:59 PM
ఓటేసేందుకు సొంతూర్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. బస్ టికెట్లపై భారీ డిస్కౌంట్ Fri, May 03, 2024, 09:56 PM
‘తూర్పు’లో గెలిస్తేనే సీఎం పీఠం.. 19 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు Fri, May 03, 2024, 09:50 PM
ఆమె గోల పడలేకే భర్త కూడా.. రోజాపై కమెడియన్ పృథ్విరాజ్ ఘాటు వ్యాఖ్యలు Fri, May 03, 2024, 09:38 PM
తిరుమలలో గదులు దొరకడం లేదా? ఇలా చేస్తే రూమ్ గ్యారెంటీ.. టీటీడీ ఈవో Fri, May 03, 2024, 09:35 PM