దేశంలో 24 గంటల్లో 91,702 కరోనా కేసులు

by సూర్య | Fri, Jun 11, 2021, 09:50 AM

 దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్నది. వరుసగా నాలుగో రోజు లక్షకు దిగువన పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,702 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 1,34,580 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 3,403 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు వదిలారని తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,92,74,823కు పెరిగింది. ఇందులో 2,77,90,073 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ బారినపడి 3,63,079 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 11,21,671 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 24,60,85,649 డోసులు వేసినట్లు చెప్పింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 94.93శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 5.14శాతంగా ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.48శాతంగా ఉండగా.. వరుసగా 18వ రోజు పదిశాతం కంటే తక్కువగా ఉందని మంత్రిత్వశాఖ వివరించింది.

Latest News

 
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM
సీనియర్ వైసీపీ నాయకుడు శెట్టూరు అబ్దుల్లా టీడీపీలో చేరిక Thu, May 02, 2024, 01:57 PM
కదిరిలో రూ.లక్ష నగదు స్వాధీనం Thu, May 02, 2024, 01:55 PM
న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడాలి: షర్మిల Thu, May 02, 2024, 01:54 PM
టిప్పు సుల్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం Thu, May 02, 2024, 01:51 PM