బాలికను కిడ్నాప్‌ చేసి.. ఇంజక్షన్లు ఇచ్చి 8ఏళ్లుగా అత్యాచారం

by సూర్య | Thu, Jun 10, 2021, 09:56 AM

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, ఆడపిల్లలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఓ దారుణం సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేసింది. కామవాంఛతో ఆ నీచులు దారుణానికి ఒడిగట్టారు. యువతికి కోరికలు రేకెత్తేలా ఇంజక్షన్లు, మందుబిల్లలు ఇస్తూ ఎనిమిదేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. చివరికి వారి పాపం పండింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారు. భర్తను భార్యనే ప్రోత్సహించడం గమనార్హం. మైనర్‌గా ఉన్నప్పుడు కిడ్నాప్‌ చేయగా ఇప్పుడు ఆ బాలిక యువతిగా మారింది. ఎట్టకేలకు నిందితుల చెర నుంచి ఆ యువతి బయటపడింది.ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కూతురు ఇంటర్‌ చదువుతుండేది. 16ఏళ్లు ఉన్న ఆ బాలికను ఎనిమిదేళ్ల కిందట కొందరు కిడ్నాప్‌ చేశారు. అప్పటి నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. బాలికకు కామ కోరికలు కలిగేలా ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. ఆమెపై ఇష్టమొచ్చినప్పుడల్లా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా బెదిరించే వారు. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామని భయపెట్టి నిర్బంధించారు. ఇలా 8 ఏళ్లుగా ముగ్గురు నీచులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీనికి నిందితుడి భార్య కూడా సహకరించేది.


చివరకు వారి చెర నుంచి బయటకు వచ్చిన యువతి అంబోలి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఓ వ్యక్తి అతడి కుమారుడితో పెళ్లి చేసేందుకు తనను ఉత్తరప్రదేశ్‌కు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో యువతి తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. పట్టుబడ్డ వారిలో నిందితుడి భార్య కూడా ఉంది. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. అంతేకాదు బాధిత యువతి కుటుంబానికి తెలిసిన వారే. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM