ఏపీలో మళ్ళి కర్ఫ్యూ పొడిగింపు

by సూర్య | Mon, Jun 07, 2021, 02:06 PM

ఏపీలో కఠిన కర్ఫ్యూ మంచి ఫలితాలు ఇస్తోంది. దీంతో మరో 10 రోజుల పాటు కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 10తో కర్ఫ్యూ గడువు ముగుస్తుండటంతో ఈనెల 20 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే కర్ఫ్యూ సడలింపులు ఇవ్వగా ఇకపై మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల పనిదినాలు ఉ.8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కొనసాగనున్నాయి.


తాజాగా ఏపీలో కరోనా కేసులు భాగానే కట్టడి అవుతున్నాయని.. మరింత అప్రమత్తంగా ఉంటే పూర్తిగా కట్టడి సాధించవచ్చని సీఎం జగన్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూను మరో 10 రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది. వారం రోజుల కిందటి వరకు ఏపీలో ప్రతి రోజూ 20 వేలకు పైగా మంది కరోనా బారిన పడే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితిలో మార్పు కనిపించింది. నిలకడగా పది వేల లోపే కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం ఊహించిన స్థాయిలో తగ్గడం లేదు. 90కు అటు ఇటుగా నమోదవుతూనే ఉన్నాయి. అందుకే కర్ఫ్యూను మరింత కాలం పొడిగించడమే మేలని అభిప్రాయానికి సీఎం జగన్ వచ్చినట్టు తెలుస్తోంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM